తెలుగు పుస్తకాలు
భాషలందు తెలుగు భాష లెస్స అని కవులు గళమెత్తి చాటారు. నా భాష కర్ణాట భాష అని శ్రీనాధుడు శ్రీ ప్రౌడ దేవరాయుల ఆస్థానంలో గొంతెత్తి పాడారు. తేనెలొలికే పదాలతో బమ్మెర పోతన భాగవతం రచియించి శ్రీకృష్ణ లీలను అందరికి కనుల ముందు సాక్షాత్కరింప చేసారు. ఈ నాడు మనదైన తెలుగు భాష సినీ పాటలకు తప్ప దేనికి వాడకపోవటం మన దురదృష్టం. వ్రాసేవారు లేక పాశ్చాత్య భాషైన ఆంగ్ల భాషకే జోహార్లు చెపుతున్న తెలుగు ప్రజానీకం, భావి తరాలవారికి తల్లి దండ్రులు తెలుగు నేర్పక ఆ తెలుగు తల్లి చివర దశలో కొట్టుమిట్టాడుతుంది. మించిందేమి లేదు, ఇప్పటికైనా కొన ప్రాణంతో వున్న మనదైన తెలుగును ప్రోత్సహించి భావితరాలవారికి నేర్పి పూర్వ ప్రగతికి తీసుకొస్తారని ఆశిస్తూ అందుకు సహకారంగా ఈ క్రింది పుస్తకాలు ఉపయోగకరమని భావిస్తూ సమర్పిస్తున్నా.